Sunday, February 23, 2025
Homeసినిమాసుమంత్ ‘వాల్తేరు శీను’ లుక్‌ అదిరింది

సుమంత్ ‘వాల్తేరు శీను’ లుక్‌ అదిరింది

Waltair Seenu: సుమంత్‌, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్‌ క్రియేషన్స్‌ పతాకం పై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ తుది దశలో ఉంది. ఈరోజు సుమంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌ లుక్‌ను విడుదలచేశారు ఈ మూవీ మేక‌ర్స్.

ఈ సంద‌ర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… సుమంత్‌ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈరోజు  విడుదల చేసిన లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి: డైరెక్ట్ గా ఓటీటీలో ‘మళ్ళీ మొదలైంది’

RELATED ARTICLES

Most Popular

న్యూస్