Saturday, January 18, 2025
Homeసినిమా'సుందర్ మాస్టర్' ఇంకాస్త కసరత్తు చేయాల్సిందేమో!

‘సుందర్ మాస్టర్’ ఇంకాస్త కసరత్తు చేయాల్సిందేమో!

ఈ మధ్య కాలంలో ఒక మంచి ట్రెండ్ వచ్చింది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ ఆదరిస్తున్నారు. చిన్న ఆర్టిస్టులే ఉన్నప్పటికీ .. తెరపై బడ్జెట్ పెద్దగా కనిపించనప్పటికీ కంకెట్ కి బాగుందని తెలిస్తే థియేటర్స్ కి వెళ్లడానికి ఆలోచన చేయడం లేదు.   అందువలన చాలానే చిన్న సినిమాలు వస్తున్నాయి. ఇక కంటెంట్ లేదని తెలిస్తే మాత్రం, ఆ మరుసటి రోజు థియేటర్స్ లో ఆ సినిమా కనిపించడం లేదనేది కూడా సత్యం.

ఇలాంటి పరిస్థితుల్లో వైవా హర్ష ప్రధానమైన పాత్రగా ‘సుందరం మాస్టర్’ సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది. టైటిల్ తోనే ఈ సినిమా చాలా స్పీడ్ గా జనంలోకి వెళ్లింది. ట్రైలర్ తోనే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందనిపించింది. ఇక వైవా హర్ష కామెడీ టైమింగ్ కీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రనే అనుకున్నారు. అందువలన సినిమాపై కొంత బజ్ అయితే ఉందనిపించింది. థియేటర్ కి వెళ్లినవారు సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు.

అలా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలి. కానీ ఈ సినిమాలో సెకండాఫ్ లో జోరు తగ్గుతుంది. హర్షవర్ధన్ .. దివ్య శ్రీపాద పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదనిపిస్తుంది. వైవా హర్ష నటన .. నిర్మాణ విలువలు .. లొకేషన్స్ వైపు నుంచి వంకబెట్టవలసిన పనిలేదు. స్క్రీన్ ప్లే వైపు నుంచి ఇంకాస్త  కసరత్తు చేసుంటే, మరింత బెటర్ గా ఉండేదేమో అనిపించక మానదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్