Sunday, January 19, 2025
Homeసినిమా‘ప్రేమ్ కుమార్’ నుంచి ‘సుంద‌రీ’ సాంగ్ రిలీజ్‌

‘ప్రేమ్ కుమార్’ నుంచి ‘సుంద‌రీ’ సాంగ్ రిలీజ్‌

‘ సుంద‌రీ.. ఓ క‌న్నే.. నీ వైపే న‌న్నే లాగింది చూపుల దార‌మే.. నీ క‌న్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి న‌చ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’  పాడుకుంటుంటాడు. అసలు ఇంత‌కీ ప్రేమ్ కుమార్ ఎవ‌రు? అత‌ని మ‌న‌సుకు న‌చ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవ‌రు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది.

రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘సుంద‌రీ..’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్‌.అనంత్ శ్రీక‌ర్ సంగీత సార‌థ్యం వహిస్తున్న ఈ సినిమాలో ‘సుంద‌రీ..’ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా, కార్తీక్ పాడారు. పెళ్లి చేసుకోవాల‌నుకునే హీరోకి ఎదురయ్యే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను ఎంట‌ర్‌టైనింగ్‌గా ‘ప్రేమ్ కుమార్’ చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు అభిషేక్ మహర్షి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్