Friday, March 13, 2026
HomeTrending Newsసూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత

సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత

సినీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న  ఆయన్ను చికిత్స కోసం గచ్చిబౌలి లోని కాంటినెంటల్ఆసుపత్రి లో చేర్పించారు.  గత నెలలో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి కన్నుమూశారు. గత ఏడాది అయన రెండో భార్య విజయ నిర్మల మరణించారు. ఇందిరాదేవి మరణం తరవాత కృష్ణ మరింత కుంగిపోయారు.

కృష్ణ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మరో 24 గంటల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు.

Also Read: కృష్ణంరాజుకు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి (దృశ్య మాలిక)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular