Saturday, January 18, 2025
Homeసినిమాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సూపర్ స్టార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సూపర్ స్టార్

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  సంతోష్ పిలుపు మేరకు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని కృష్ణ అభినందించారు. గతంలో కూడా తానూ ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కు కృతజ్ఞతలు చెప్పారు కృష్ణ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్