Saturday, January 18, 2025
Homeసినిమా'మిస్టర్ కింగ్`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ

‘మిస్టర్ కింగ్`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ

Mr. King: విజ‌యనిర్మ‌ల మ‌న‌వడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.  సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా `మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకం పై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే `మిస్టర్ కింగ్`షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వుంది. ఈ సంద‌ర్భంగా  ఈ సినిమా పోస్ట‌ర్‌ను విజ‌యనిర్మ‌ల జ‌యంతి సంద‌ర్భంగా నాన‌క్ రూమ్ గూడాలోని తన స్వ‌గృహంలో సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్క‌రించారు.

అనంత‌రం కృష్ణ మాట్లాడుతూ.. విజ‌యనిర్మ‌ల జ‌యంతి సంద‌ర్భంగా `మిస్టర్ కింగ్`పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించ‌డం ఆనందంగా వుంది. ఈ సినిమా ద్వారా హీరోగా శ‌ర‌ణ్ మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. సినిమా సూప‌ర్ హిట్ కావాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

సీనియ‌ర్ న‌రేశ్ మాట్లాడుతూ… హీరో శ‌ర‌ణ్ నా అల్లుడు. నా క‌జిన్ రాజ్ కుమార్ కొడుకు. మా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న 8వ హీరో. మంచి టీమ్‌తో ముందుకు వ‌స్తున్నారు. మా అమ్మ‌ ప్ర‌తి పుట్టిన‌రోజునాడు అభిమానులు ఇక్క‌డ‌కు వ‌చ్చి ఆశీర్వ‌చ‌నాలు తీసుకునేవారు. ఈ సంద‌ర్భంగా `మిస్టర్ కింగ్`పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. ఎట్రాక్టివ్ టైటిల్‌తో అల‌రించేట్లుగా వుంది. ఈ సినిమాలో స‌హ‌న‌టులు సీనియ‌ర్స్ ముర‌ళీశ‌ర్మ‌, సునీల్ వంటి వారు న‌టిస్తున్నారు. చ‌క్క‌టి నిర్మాణ విలువ‌ల‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా. శ‌ర‌ణ్ మంచి హీరో అవ్వాల‌ని కోరుకుంటున్నానని తెలిపారు.

చిత్ర హీరో శరణ్ మాట్లాడుతూ.. తాత గారు కృష్ణ‌, న‌రేశ్ అంకుల్, నాని ఆశీర్వాదాల‌తో నేను హీరోగా ముందుకు వ‌స్తున్నాను. న‌రేశ్ అంకుల్ నా రోల్ మోడ‌ల్‌. తాత గారి సినిమాలు, న‌రేశ్ అంకుల్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలా ఇంట్రెస్ట్ తో హీరో అవ్వాల‌నుకున్నాను. ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో నా పాత్ర పేరు శివ‌. యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుందని న‌మ్ముతున్నాను. మ‌ణిశ‌ర్మ గారు చ‌క్క‌టి బాణీలు స‌మ‌కూర్చార‌ని తెలిపారు.

Also Read : వర్జిన్ స్టోరి యూత్ కు బాగా క‌నెక్ట్ అయ్యింది : లగడపాటి శ్రీధర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్