Sunday, January 19, 2025
Homeసినిమా‘లవ్ స్టోరి’ కోసం మహేష్ బాబు ఎదురుచూపు

‘లవ్ స్టోరి’ కోసం మహేష్ బాబు ఎదురుచూపు

యువ సమ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.  ఇటీవల జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కావడం… ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సస్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

తాజాగా ‘లవ్ స్టోరీ’ గురించి సూపర్ స్టార్ మహేష్‌ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ… “డ్యాన్స్ నేపధ్యంతో రూపొందిన చిత్రం లవ్ స్టోరీ. ఇలా డ్యాన్స్ నేపథ్యంలో సినిమా రూపొందడం తెలుగులో చాలా అరుదు. ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘లవ్ స్టోరీ’ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అని శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్