Monday, January 20, 2025
HomeTrending Newsపోస్టల్ బ్యాలెట్ మెమోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం

పోస్టల్ బ్యాలెట్ మెమోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైఎస్సార్సీపీకి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి…  సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక మెమోపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ విషయమై తొలుత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ మరియు జస్టిస్ కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మెమోను సమర్ధించింది. దీనిపై మళ్ళీ వైఎస్సార్సీపీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పీ) దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ స్వీకరించిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను తిరస్కరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్