Thursday, January 23, 2025
Homeతెలంగాణరేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట

రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపి రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశించింది.  తెలంగాణా అవినీతి నిరోధక శాఖ కు నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ వీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

ఏదైనా కేసులో సాక్షులు తమంతట తాము వాంగ్మూలం ఇస్తారు, ఆ తర్వాత సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. కానీ ఏసిబి కోర్టులో  క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టారు. దీనిపై మొదట రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, కానీ అక్కడ చుక్కెదురైంది. దీనిపై రేవంత్ సుప్రీం ను ఆశ్రయించగా నేడు విచారించి రేవంత్ కు ఊరట ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్