Wednesday, March 11, 2026
Homeసినిమా‘సూరాపానం’లో పార్వతి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

‘సూరాపానం’లో పార్వతి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

సంపత్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సూరాపానం’. కిక్‌ అండ్‌ ఫన్‌ అనేది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై మధు యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్‌ ఫస్ట్‌ లుక్‌ను నేడు ఆమె జన్మదినం సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు సంతప్ కుమార్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్‌ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది.

నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా అందించబోతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథ ఉంటుంది. ఓ డిఫరెంట్ మూవీని చూసిన ఫీలింగ్ ని ఆడియన్స్ కి ఖచ్చితంగా కలిగిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. అజయ్‌ ఘోష్‌, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రప్రసాద్‌, కెమెరా: విజయ్‌ ఠాగూర్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular