Friday, March 20, 2026
Homeసినిమాసురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రుహాణి శర్మ'HER' చిత్రం విడుదల

సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రుహాణి శర్మ’HER’ చిత్రం విడుదల

రుహాణి శర్మ రీసెంట్ గా HIT సినిమాతో అందం, అందుకు తగ్గ అభియనం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘HER’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో HER ఫైనల్ కాపీ చుసిన సురేష్ ప్రొడక్షన్స్ వారు.. తమ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ లభించడం తమ విజయానికి తొలి మెట్టు అని చెబుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. గతంలో విడుదల చేసిన HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో రుహాణి శర్మ ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular