Thursday, March 19, 2026
HomeసినిమాKanguva: సూర్య42 మూవీ టైటిల్ 'కంగువ'

Kanguva: సూర్య42 మూవీ టైటిల్ ‘కంగువ’

సూర్య, దిశా పటాని, యోగి బాబు ముఖ్యపాత్రల్లో మాసివ్ డైరెక్టర్ శివ ఓ భారీ చిత్రం రూపొందిస్తున్నారు. సెప్టెంబరు 2022లో ఈ సినిమా ప్రారంభం కాగా, గతంలో విడుదల చేసిన మోషన్ పోస్టర్ వీడియో భారీ హైప్‌ని సృష్టించింది. దీంతో టైటిల్ పై ఆసక్తి పెరిగింది. ‘కంగువ’ అనే టైటిల్‌ను నేడు ప్రకటించారు. స్టూడియో గ్రీన్ కె.ఇ. యువి క్రియేషన్స్ వంశీ-ప్రమోద్‌తో కలిసి జ్ఞానవేల్‌రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం . 3డిలో 10 భాషల్లో రూపొందుతోంది. గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో షూటింగ్ జరుగుతోంది. ఇప్ప‌టికే 50 శాతం పూర్త‌య్యింది. మ‌రో నెల‌లో బ్యాల‌న్స్ షూటింగ్ పూర్తి చేయ‌నున్నారు. 3Dలో ఈ యాక్షన్ మూవీ వివిధ అవతారాలలో మోస్ట్ పవర్ఫుల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అధిక స్థాయిలో విఎఫ్ఎక్స్, CGI వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘సూర్య 42వ చిత్రం కంగువ అనే టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉంది. సూర్య చాల గంభీరంగా తెర పై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైన సినిమా. అందరికీ అద్భుతమైన అనుభూతినిస్తుంది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular