Tuesday, March 10, 2026
Homeసినిమాఓటీటీలో రిలీజ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’

తమిళ స్టార్ హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సక్సెస్ సాధించారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడం పై తమిళనాడులో థియేటర్ల యాజమాన్యాలు సూర్య పై ఫైర్ అయ్యారు. ఇక నుంచి సూర్య సినిమాలను థియేటర్లో రిలీజ్ కానివ్వం అన్నారు. అయినప్పటికీ.. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ను డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘జై భీమ్’. ఈ చిత్రానికి జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘జై భీమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివ‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండియ‌న్ స‌హ నిర్మాత‌. ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నవంబర్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అఫిషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజీషా విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ప్రకాష్ రాజ్, రావు ర‌మేష్‌, మ‌ణికంద‌న్, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు కీలకపాత్రల‌లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular