Monday, September 30, 2024
Homeసినిమామ‌హేష్ మూవీలో పూజానా..? ర‌ష్మికనా..?

మ‌హేష్ మూవీలో పూజానా..? ర‌ష్మికనా..?

Who’s finalized? ‘స‌ర్కారు వారి పాట’తో స‌క్సెస్ సాధించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తన త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో  చేస్తోన్న విషయం తెలిసిందే.  ప్ర‌స్తుతం ఈ భారీ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌రలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

అయితే.. ఈ మూవీలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా గ‌తంలో మ‌హ‌ర్షి మూవీలో న‌టించింది. ఈ జంట బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ పూజానే క‌న్ ఫ‌ర్మ్ చేశార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు కొత్త‌గా మ‌రో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక పేరు వినిపిస్తోంది. ర‌ష్మిక మందన్నకి తెలుగు .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక తమిళ, హిందీ భాషల్లోను అదే రేంజ్ లో చక్రం తిప్పే సమయం కోసం ఆమె వెయిట్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన పుష్ప సంచలన విజయాన్ని సాధించింది. ఇక తెలుగులో మ‌హేష్‌, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టుగా ఒక వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో మరో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారా?   లేక పూజా ప్లేస్ లో ర‌ష్మిక‌ను తీసుకున్నారా..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు ఎక్క‌డో తెలుసా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్