Sunday, March 15, 2026
HomeTrending Newsముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్

ముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనల్ని నియంత్రించడంలో విఫలమైన అధికారులపై ఆబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ఒకేసారి వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు సీఐలను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లకు గురైన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సీఐ నరేందర్, మహబూబాబాద్ సీఐ రమేశ్ చందర్, సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ సీఐ శ్యామస్సుందర్ ఉన్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు పెద్ద యెత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచారం అందు కున్న ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ధరలు ఉల్లంఘనలు వాస్తమేనని గుర్తించి నివేదిక అందించడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular