Saturday, January 18, 2025
Homeసినిమామహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్

మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్

Yes, its on: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు అప్ డేట్స్ కోసం ఆతృత‌గా  ఎదురు చేస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో అప్ డేట్స్ ఇవ్వండి అంటూ సోష‌ల్ మీడియా ద్వారా ప్రొడ్యూస‌ర్ ని అడుగుతున్నారు.

అప్ డేట్ ఎప్పుడు అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు నాగ‌వంశీ స్పందిస్తూ.. ‘అభిమానుల ఆతృత‌ను అర్ధం చేసుకోగలం అని కానీ ఏదైనా సరే సమయం వచ్చినప్పుడే చెబితే శ్రేయస్కరంగా ఉంటుందని  భావిస్తున్నాం’ అన్నారు. ‘అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అప్ డేట్స్ అందించలేమని దాదాపు 12 ఏళ్ళు తర్వాత మహేష్ గారు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి ప్రతీది స్పెషల్ గానే ఉండాలి. అందుకే ఆ అప్ డేట్స్ ని స్పెషల్ డే కి ప్లాన్ చేసి రిలీజ్ చేస్తామని,  ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ ఒక మరపురాని సినిమాగా నిలుస్తుంద’ని చెప్పారు.

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్, త్రివిక్ర‌మ్ క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో మ‌హేష్ ని ఎలా చూపించ‌బోతున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. మ‌హేష్ ని స‌రికొత్త‌గా త్రివిక్ర‌మ్ ఎలా చూపిస్తారో… బాక్సాఫీస్ ని ఎలా మెప్పిస్తారోచూడాలి.

Also Read : చిరు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?  

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్