Wednesday, March 11, 2026
Homeసినిమాఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా 'గణా' ఫస్ట్ లుక్ పోస్టర్

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘గణా’ ఫస్ట్ లుక్ పోస్టర్

రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్  పై `దుర్మార్గుడు` ఫేమ్  విజ‌య్ కృష్ణ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన  చిత్రం ‘గ‌ణా’. సుక‌న్య‌, తేజు హీరోయిన్స్ గా న‌టించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమా  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ కృష్ణా రెడ్డి  మాట్లాడుతూ.. నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా కృష్ణారెడ్డే. కాకపోతే విజయ్ కృష్ణా రెడ్డి. ఇత‌ను  కృషితో, పట్టుదలతో, దీక్ష‌తో  గ‌ణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ కృష్ణా  హీరోగా న‌టిస్తూ  కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయ‌డ‌మంటూ మామూలు విష‌యం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి. ఎంతో మంది వ్యక్తులు ఇతనికి సహకరించడం వలన సాధ్యపడుతుంది.  సినిమా అంటే మాటలు కాదు కదా.. కాబట్టి అందరి సహకారంతో ఇతను ఈ సినిమాని నిర్మించగలిగారు.అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యా శేషారెడ్డిగారు, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డి గారు, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్ గారు, కర్రి బుచ్చిరెడ్డి గారు ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తియ్యాలనే తపనతో మన ముందుకొచ్చారు. నా చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular