Friday, March 13, 2026
HomeసినిమాSwathi Reddy: విడాకుల ప్రశ్న.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన స్వాతి

Swathi Reddy: విడాకుల ప్రశ్న.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన స్వాతి

బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి. టీవీలో కలర్స్ ప్రొగ్రామ్ తో అందర్నీ ఆకట్టుకుని కలర్స్ అనే పొగ్రామ్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఆతర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన డేంజర్ సినిమాలో హీరోయిన్ అయ్యింది. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేష్‌ కు మరదలగా నటించింది. ఆతర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుంది.

మంత్ ఆప్ మధు అనే సినిమాలో నవీన్ చంద్రకు జంటగా నటించింది. అయితే.. గత కొన్ని రోజులుగా కలర్స్ స్వాతి విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. నిజంగానే విడాకులు తీసుకుందా..? లేక ఇది గ్యాసిప్పా..? అనేది క్లారిటీ లేదు. మంత్ ఆప్‌ మధు సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన స్వాతికి విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానని చెప్పి.. ఆతర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానం నే చెప్ప.. అంటూ చాలా తెలివిగా తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular