Friday, November 22, 2024
Homeసినిమా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను - సోహైల్

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను – సోహైల్

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకం పై దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ… ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసేందుకు నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నాను. ఏం చేసినా మనం వైఫ్ కు హెల్ప్ చేయగలం కానీ మనం ఆ బాధను తీసుకోలేం. మా పాప పుట్టినప్పుడు ఆమెను నా చేతికి ఇచ్చారు డాక్టర్స్. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అలాంటి అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నాను. ఇదొక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా వెకిలిగా, పిచ్చి కామెడీ చేశారని అంటారు. అందుకే.. చాలా జాగ్రత్తగా, కత్తి మీద సాములా రూపొందించాం. సోహైల్, రూపా పోటీ పడి ఫర్ ఫార్మ్ చేశారు. సోహైల్ కు ఎంత పేరొస్తుందో, రూపకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కదిలించే ఎమోషన్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా, లవర్స్ అయినా కలిసి చూసేలా ఉంటుంది అన్నారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ… దర్శకుడు శ్రీనివాస్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. కొద్ది సేపటికి ఇంకో కథ ఉంది వింటావా అన్నారు. నేను మిస్టర్ ప్రెగ్నెంట్ కథే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే.. ఇవాళ ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మా సినిమా కూడా వాళ్లకు అలాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను. ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్ షాప్స్ చేశాం. రియల్ గా ప్రెగ్నెన్సీ అంత బరువుండే ప్రోత్సటిక్స్ వాడాము. ఈ సినిమా మొదలైన కొత్తలో కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడా ప్రెగ్నెన్సీ మీద కామెడీ డైలాగ్స్ పెట్టలేదు. హుందాగా ఒక కథను తెరకెక్కించాం. సినిమా చూశాక మీ సిస్టర్స్, మదర్ ను హగ్ చేసుకుంటారు. ఈ సినిమా ఒప్పుకున్న టైమ్ లో మా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్స్ గా ఉన్నారు. వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్ వుమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇక పై కూడా ఇలాంటి డెఫరెంట్ మూవీస్ చేస్తాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్