ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ కొండాపూర్ ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్‌గా 134 వైద్య పరీక్షలను మంత్రి హరీశ్ రావు ఈ రోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని తెలిపారు.


