Sunday, January 19, 2025
Homeసినిమాహిజ్రాల హక్కుల కోసం జరిగే పోరాటమే 'తాలి'

హిజ్రాల హక్కుల కోసం జరిగే పోరాటమే ‘తాలి’

బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరోలు .. హీరోయిన్స్ ఇప్పుడు తెరపై కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తమ స్థానానికి మరింత ప్రత్యేకతను తెచ్చుకుంటున్నారు. సినిమా అయినా .. వెబ్ సిరీస్ అయినా తమని తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి వాళ్లు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. అలాంటి ఆర్టిస్టుల జాబితాలో తాజాగా సుస్మితా సేన్ కూడా చేరిపోయింది. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ ‘తాలి’.

‘జియో సినిమా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్ లో సుస్మిత సేన్ ‘హిజ్రా’ పాత్రలో కనిపిస్తుంది. పెద్దగా కనిపించే ఎర్రని బొట్టుతో కూడిన సుస్మిత సేన్ లుక్ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. రవి జాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ అంతా కూడా హిజ్రాల హక్కుల కోసం జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. గతంలో ఈ విషయంపై పోరాటం సాగించిన గౌరీ సావంత్ జీవితమే ఈ సిరీస్.

హిజ్రాల పట్ల ఈ సమాజం ఎలా వ్యవహరిస్తోంది. అందువలన వాళ్లు మానసికంగా ఎంతగా కుంగిపోతున్నారు .. ఈ సమాజం వాళ్లపై కనికరం చూపకపోగా అనేక నేరాల్లో వాళ్లను నిందితులుగా చేరుస్తూ హింసకి గురి చేస్తున్నారనే ఒక ఆవేదనను ఈ సిరీస్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. సమాజంలో వాళ్లకి సమానత్వాన్ని కల్పించాలి అనే నినాదాన్ని వినిపించారు. ‘హిజ్రా’ల జీవితాలను దగ్గరగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్