Saturday, January 18, 2025
HomeTrending Newsసీసీఐ పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్రానికి కేటీఆర్ విన‌తి

సీసీఐ పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్రానికి కేటీఆర్ విన‌తి

ఆదిలాబాద్ సీసీఐ ప‌రిశ్ర‌మ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ విన‌తి చేశారు. సీసీఐ ప‌రిశ్ర‌మ తొల‌గింపు ఉత్త‌ర్వుల‌పై పున‌:స‌మీక్షించాల‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను కేటీఆర్ కోరారు. పున‌రుద్ధ‌ర‌ణ కోసం సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పున‌రుద్ధ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌కు ఆర్థిక‌ప‌ర‌మైన ప్రోత్సాహ‌కాలు ఇస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

సిసిఐ పునరుద్దరంకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పరిశ్రమకు తొలగింపునకు యత్నిస్తోందని మంత్రి కేటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సిసిఐ ప్రారంభం అయితే ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటిఆర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్