Friday, February 21, 2025
HomeTrending Newsతాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

ముఖ్యమంత్రి కెసిఆర్ తాలిబాన్ సీఎం గా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. రైతుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ వారికి విత్తనాలు కూడా దొరకకుండా చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తెలంగాణలో కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  సుప్రీమ్ కోర్ట్ తీర్పును గౌరవించమని చెప్పే కలెక్టర్ లు ఎం కలెక్టర్ లు అని ప్రశ్నించారు.

హైకోర్ట్ లో తెరాస ప్రభుత్వ న్యాయవాది దళిత బందుకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారని, ఎలక్షన్ కమిషన్ న్యాయవాది మాకు ఎవరు లేఖ రాయలేదు మేము సుమోటాగా తీసుకున్నామని చెప్పారని సంజయ్ చెప్పారు. ఇప్పటికైనా దళితులకు తెరాస పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పాలన్నారు. క్రికెట్ లో కామెంటేటర్ హర్ష భోగ్లే, రాజకీయాల్లో కెసిఆర్.. ఇద్దరూ ఒక్కటే. ఇద్దరివి మాటలు తప్ప చేతలు ఉండవని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్