Sunday, September 29, 2024
Homeసినిమా‘గని’లో తమన్నా 'కొడితే' ఫుల్ వీడియో సాంగ్

‘గని’లో తమన్నా ‘కొడితే’ ఫుల్ వీడియో సాంగ్

Tamannah – Kodite: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ‘కొడితే‘ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వీడియో సాంగ్ వచ్చింది. తమన్నా అంద చందాలు పాటకు అదనపు ఆకర్షణ. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది.

Also Read : ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్