Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య సరసన సందడి చేయనున్న తమన్నా! 

బాలయ్య సరసన సందడి చేయనున్న తమన్నా! 

తమన్నా తన కెరియర్ ను మొదలుపెట్టి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. ఈ జర్నీలో ఆమె తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొత్తగా ఎంతమంది కథానాయికలు వస్తున్నా, ఆ పోటీని తట్టుకుని నిలబడుతోంది. తెలుగులో సీనియర్ స్టార్స్ సినిమాలో తమన్నా బిజీ అవుతోందనే విషయం తెలుస్తూనే ఉంది. చిరంజీవి … బాలకృష్ణ … నాగార్జున .. వెంకటేశ్ వంటివారితో సినిమా ప్లాన్ చేసేవారు ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారు.

ఇక తమన్నా స్పెషల్ సాంగ్స్ వైపు నుంచి కూడా తన జోరును కొనసాగిస్తోంది. ‘అల్లుడు శీను’ .. స్పీడున్నోడు’ .. ‘జై లవ కుశ’ .. ‘సరిలేరు నీకెవ్వరు’ మొదలైన సినిమాల్లో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్  చాలా పాప్యులర్ అయ్యాయి. రీసెంటుగా ‘జైలర్’ సినిమా కోసం తమన్నా చేసిన ‘నువ్వు కావాలయ్యా’ పాట .. జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఈ మధ్య కాలంలో తమన్నా గురించి ఎక్కువమంది మాట్లాడుకునేలా చేసింది ఈ పాటనే.

ఈ నేపథ్యంలో ఆమె మరో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది .. అదీ బాలయ్య సరసన. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేయనున్నారని చెప్పారు. ఆల్రెడీ మీనాక్షి చౌదరి .. ఊర్వశి రౌతేలా షూటింగులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా పేరు తెరపైకి వచ్చింది. బాలకృష్ణ – తమన్నా కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. బాలకృష్ణతో కలిసి తమన్నా తెరపై కనిపించడం ఇదే మొదటిసారి కావడం ఇక్కడి విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్