Thursday, May 29, 2025
Homeసినిమాభోళా శంకర్ జోడీగా తమన్నా

భోళా శంకర్ జోడీగా తమన్నా

Tamannah To Pair Up With Chiru In Bhola Shankar Movie :

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘ఆచార్య’ రిలీజ్ కి రెడీగా ఉంది. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఆచార్య విడుదలకు ముందే మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ‘గాడ్ ఫాద‌ర్’ మూవీలో చిరంజీవి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుగుతోంది. మరోవైపు బాబీ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న మరో సినిమాను కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.

దీనితో పాటుగా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో చేయ‌నున్న ‘భోళా శంక‌ర్’ సినిమా ఈ నెల 11న ఉద‌యం 7.45 నిమిషాల‌కు పూజా కార్యక్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. దీనిలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం వెల్లడైంది. చిరు స‌ర‌స‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌బోతోంది. నిన్న ఈ సినిమాకి సంబంధించి టెస్ట్ లుక్ అండ్ ఫోటో షూట్ చేశార‌ని తెలిసింది.. రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈ నెల‌ 15 నుంచి స్టార్ట్ చేయ‌నున్నారు. 2022లో థియేట‌ర్లో రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తానికి చిరంజీవి య‌మా స్పీడుగా సినిమాలు చేస్తూ దూసుకెళుతుండ‌డం విశేషం.

కాగా, చిరంజీవి గత చిత్రం ‘సైరా’లో తమన్నా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. చిరంజీవి సర్ తో కలిసి మరోసారి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తమన్నా ట్వీట్ చేసింది.

Also Read :

చిరంజీవి ‘భోళా శంకర్’ టైటిల్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన మ‌హేష్‌ బాబు

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్