Saturday, January 18, 2025
HomeసినిమాTamil Heros: షాక్ లో ఆ.. నలుగురు. మరి.. నెక్ట్స్ ఏంటి..?

Tamil Heros: షాక్ లో ఆ.. నలుగురు. మరి.. నెక్ట్స్ ఏంటి..?

కోలీవుడ్ హీరోలు విశాల్, ధనుష్, శింబు, అధర్వ.. ఈ నలుగురు హీరోలకు తమిళ చిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఇంతకీ.. రెడ్ కార్డ్ అంటే ఏంటి..? అనుకుంటున్నారా..? దీని ప్రకారం.. ఈ నలుగురు హీరోలతో తమిళ్ లో ఎవరూ సినిమాలు నిర్మించకూడదు. ఈ నిర్ణయాన్ని అతిక్రమించిన వాళ్ల పై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటుంది. ఈ నలుగురు హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో నిర్మాతల మండలి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం షాకే అని చెప్పచ్చు.

ఇంతకీ.. ఈ హీరోలు చేసిన తప్పేంటి అంటే.. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ధనుష్, శింబు, అధర్వ.. వీళ్లు సరిగా షూటింగ్ కు రాకపోవడం వలన నిర్మాతలకు సహకరించకపోవడం వలన ఈ హీరోలతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకు భారీగా నష్టం వచ్చిందట. ఆ నిర్మాతలు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారట. ఈ వివాదం గురించి ఈ హీరోలతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా మార్పు రాకపోవడంతో నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుందట. ఈ సమాచారాన్ని నిర్మాతల మండలి కోలీవుడ్ మీడియాకు అందించడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయ్యింది. ఇది కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.

మరి.. ఈ నలుగురు నెక్ట్స్ ప్లాన్ ఏంటి..? అంటే.. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం గురించి స్పందించలేదు కానీ.. చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే.. గతంలో కూడా తమిళ నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుందట కానీ.. అమలులోకి రాలేదట. అయితే.. ఇప్పుడు ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో అందరి పై ఉంటుంది. ముఖ్యంగా హీరోల పై ఉంటుంది. అందుచేత హీరోలందరూ నిర్మాతకు నష్టం రాకుండా ఉండేలా ఆలోచిస్తే.. ఎంతో బాగుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్