Saturday, November 23, 2024
HomeTrending Newsబాలచందర్ కు అంకితం: రజని

బాలచందర్ కు అంకితం: రజని

తన గురువు బాలచందర్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అంకితం ఇస్తున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, తనకు ఈ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి రజని కృతజ్ఞతలు తెలిపారు. తనను ప్రోత్సహించిన సోదరుడు సత్యనారాయణ, స్నేహితుడు, కర్నాటక ట్రాన్స్ పోర్ట్ బస్ డ్రైవర్ రాజ బహదూర్ లకు అయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్నేళ్ళ నట జీవితంలో తనను ఆదరిస్తూ వచ్చిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సహా నటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు అందజేశారు. ముఖ్యంగా తమిళ అభిమానులు లేకపోతే తాను లేనని భావోద్వేగంతో చెప్పారు.

ఢిల్లీలో 67వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది, సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అవార్డు గ్రహీతలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి ఎల్. మురుగన్, అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అత్యంత ప్రతిష్ఠత్మకమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని అందుకున్నారు.  ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్‌ జాతీయ ఉత్తమ నటిగా; ఉత్తమ నటుడిగా ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (భోంస్లే) సంయుక్తంగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)కి అవార్డు పొందారు.

ఉత్తమ తెలుగు ‘జెర్సీ’ నిలిచింది. ఎడిటింగ్‌ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు సినిమాగా ‘మహర్షి’ సినిమాకు అవార్డు లభించింది. ఈ అవార్డును దర్శకుడు పైడిపల్లి వంశీ, నిర్మాత దిల్ రాజు అందుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్