Sunday, September 8, 2024
HomeTrending Newsరాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై

రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై

రాష్ట్ర ప్రభుత్వం తనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోయినా తాను బాధపడనని, కానీ గవర్నర్ పదవిని గౌరవించాలని ప్రభుత్వానికి చురకలు అంటించారు. మేడారం పర్యటనకు తాను వెళ్లనని అనుకుంటే కనీసం హెలికాప్టర్ కూడా ఇవ్వలేదన్నారు. చివరి నిమిషం వరకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో  తాను 8గంటలపాటు ప్రయాణం చేసి రోడ్డు మార్గం ద్వారా అక్కడకు వెళ్లాలని చెప్పారు. జిల్లాల పర్యటనకు వెళితే కనీసం  కలెక్టర్లు, ఎస్పీలు  మర్యాదపూర్వకంగా అయినా కలవడం లేదన్నారు. గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళి సై రాజ్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని ఎత్తి వేశారని…. రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జెండా ఎగురవేయడం సంప్రదాయమని, దాన్ని కూడా పాటించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఇండిపెండెన్స్ డే రోజన ఎట్ హోమ్ కార్యక్రమానికి సిఎం హాజరవుతున్నట్లు ముందుగా చెప్పి చివరి నిమిషంలో  రద్దు చేసుకున్నారని, కారణం తెలియదని… అయన కోసం అరగంట ఎదురు చూసి తర్వాత మొదలు పెట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

నాకు గౌరవం ఇవ్వనంత మాత్రాన తనకు పోయేదేమీ లేదని, పేదలకోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.  ఇప్పుడు రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారిందని,వ రాజ్ భవన్ పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. తాను అవకాశం ఉన్నత వరకూ రాష్ట్రంలోని సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నానని, ఎన్నో అంశాలపై లేఖలు రాస్తున్నానని, వాటికి జవాబు రావడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.  ‘ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించాను… ఎన్నో యూనివర్సిటీ లకు వెళ్ళాను… హాస్టల్స్ కి వెళ్ళాను.. సమస్యలు తెలుసుకున్నాను’ అని తమిళిసై వివరించారు. తనకు ఎంతో పనిచేయాలని ఉందంటూ. సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు గవర్నర్.

Also Read : గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్