Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ మూవీలో నంద‌మూరి హీరో?

మ‌హేష్ మూవీలో నంద‌మూరి హీరో?

Mahesh-Taraka Ratna: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ రూపొందుతుండ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తోంది. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జూన్ నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర ఉంద‌ని..ఆ పాత్ర‌ను హీరో నానితో చేయించ‌నున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు కొత్త‌గా నంద‌మూరి హీరో పేరు వినిపిస్తోంది. ఎవ‌రంటారా..?  నంద‌మూరి తార‌క‌ర‌త్న‌. ఇందులో నెగిటివ్ రోల్ కోసం ఆయనను తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తారకరత్న హీరోగా ఒకేసారి 9 సినిమాలు మొదలయ్యాయి. అయితే, నాలుగైదు సినిమాల తర్వాత మిగతావేవీ పట్టాలెక్కలేదు.

ఆ తర్వాత కొన్ని సినిమాలలో నెగిటివ్ రోల్స్ కూడా చేశారు కానీ, ఏదీ ఆయనకు అంతగా క్రేజ్ తెచ్చిపెట్టింది లేదనే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ తార‌క‌ర‌త్న స‌క్సెస్ కోసం.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. మరి మహేష్‌ – త్రివిక్రమ్ సినిమాలో తారకరత్న నటించడం అనేది నిజమైతే.. ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టే. అదే జ‌రిగితే.. ఈ సినిమాతో అయినా ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్