Friday, July 5, 2024
HomeTrending Newsఈనెల 5 నుంచి చంద్రబాబు 'రా! కదలిరా!: అచ్చెన్నాయుడు

ఈనెల 5 నుంచి చంద్రబాబు ‘రా! కదలిరా!: అచ్చెన్నాయుడు

జగన్ పాలనలో వైఫల్యాలు, విధ్వంసాలు తప్ప విజయాలు ఏవీ లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారం ఓ బాధ్యతగా భావించాల్సిన సిఎం జగన్ ప్రజల జీవితాలను అంధకారంలో నేట్టేశారని, స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. పంచాయతీల హక్కులను కాలరాసే విధంగా, నిధులు తాను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్ళించారని అన్నారు. గ్రామాల్లో కనీసం వీధి లైట్లు కూడా వేయలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  అనేక వర్గాల వారు ఆందోళన చేసున్నారని రాష్ట్రం ఆందోళనాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిడిపి కార్యక్రమాలను రూపొందించిందని చెప్పారు. రేపు  జనవరి ౩న పంచాయతీరాజ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. జగన్ తన పదవీ కాలంలో స్థానిక సంస్థలను ఏ విధంగా అణగదొక్కారో చర్చించి, రాబోయే కాలంలో తాము అధికారంలోకి రాగానే  ఏం చేస్తామో చెబుతామన్నారు.

దీనితో పాటు 4న పార్టీ కార్యాలయంలో ‘జయహో బిసి’ పేరిట బిసి వర్గాల సదస్సును ఏర్పాటు చేశామన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 5 నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తారని… ‘రా! కదలిరా!’ పేరిట ఈ సభలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానికి పార్టీ తరఫున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

  • 5న ఒంగోలు పార్లమెంట్ సదస్సు కనిగిరిలో
  • 6న విజయవాడ పార్లమెంట్ సదస్సు తిరువూరులో; అదేరోజు నర్సాపురం సదస్సు ఆచంటలో
  • 9న తిరుపతి సదస్సు వెంకటగిరిలో;  అదేరోజు నంద్యాల సదస్సు ఆళ్ళగడ్డలో
  • 10 విజయనగరం- బొబ్బిలి; కాకినాడ సదస్సు తునిలో
  • 18న ఎన్టీఆర్ వర్ధంతి రోజున మచిలీపట్నం పార్లమెంట్ సదస్సు గుడివాడలో
  • 19 న చిత్తూరు పార్లమెంట్ సదస్సు గంగాధర  నెల్లూరులో ; అదేరోజు కడప సదస్సు కమలాపురంలో
  • 20 న అరకు పార్లమెంట్ సదస్సు అరకు వ్యాలీలో; అదేరోజు అమలాపురం సదస్సు మండపేటలో
  • 24 రాజంపేట పార్లమెంట్ సదస్సు పీలేరులో, అదేరోజు అనంతపురం సదస్సు  ఉరవకొండలో
  • 25న నెల్లూరు పార్లమెంట్ సదస్సు కోవూరులో; కర్నూలు సదస్సు పత్తికొండలో
  • 27న రాజమండ్రి పార్లమెంట్ సదస్సు గోపాలపురంలో; గుంటూరు సదస్సు పొన్నూరులో
  • 28న అనకాపల్లి పార్లమెంట్ సదస్సు మాడుగులలో, శ్రీకాకుళం సదస్సు  టెక్కలిలో
  • 29న ఏలూరు పార్లమెంట్ సదస్సు ఉంగుటూరులో, బాపట్ల సదస్సు చీరాలలో నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్