Sunday, January 19, 2025
HomeTrending Newsగత ఎన్నికలకంటే ఘోరంగా టిడిపి ఓటమి: సజ్జల

గత ఎన్నికలకంటే ఘోరంగా టిడిపి ఓటమి: సజ్జల

ఏపీలో విపక్షాల కూటమి ఓ విఫలయత్నంగా మిగిలిపోతుందని, పేరుకే దానిలో మూడు పార్టీలు ఉన్నా బిజెపి, జనసేనల తరఫున ఎక్కువమంది టిడిపి సూచించిన వారే అభ్యర్ధులుగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.  కూటమిలో చేరడంవల్ల బిజెపి, జనసేన పార్టీల ఉనికి రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

గత ఎన్నికలకంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలవుతుందని, ఏపీ రాజకీయ తెరపై ఆ పార్టీ  పూర్తిగా కనుమరుగవుతుందని సజ్జల జోస్యం చెప్పారు. అందుకే బాబు గంగవెర్రులెత్తి పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 73 ఏళ్ళ వయసున్న చంద్రబాబు ‘సైకో పోవాలి- సైకిల్ రావాలి’ అనే పాటకు చేతులు ఊపుతూ డ్యాన్స్ వేయడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు దాన్ని ధర్మయుద్ధంగా దాన్ని భావిస్తే ప్రజలకు సంబంధించిన అజెండాపై పోరాడాలి కానీ పిల్ల చేష్టలు వేస్తూ… పిచ్చివాళ్ళు ఎగురుతున్నట్లు, పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు దారుణంగా తయారయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని, తమ పార్టీ ఎమ్మెల్యేను బిజెపిలోకి పంపి… తిరుపతి ఎంపి అభ్యర్ధిగా పోటీచేస్తున్న వరప్రసాద్ కు ఓటు వేయవద్దని చెప్పారని… మతిమరుపు ఎక్కువైందని  దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అధికారులపై ఎడాపెడా ఫిర్యాదులు చేసి వారిని ట్రాన్స్ ఫర్లు చేయిస్తున్నారని…  అయితే ఒక్కసారి కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది కాబట్టిదానికి సిఎం జగన్ కూడా ఏమీ అభ్యంతరం పెట్టడంలేదని… కానీ గత ఎన్నికల సమయంలో సిఎంగా ఉన్న బాబు నేరుగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి వద్దకు వెళ్లి బెదిరించిన సందర్భం ఉందని అంటూ దానికి సంబంధించిన వీడియోను మీడియాకు ప్రదర్శించారు.  పెన్షన్ల పంపిణీ విషయంలో బాబు వ్యవహరించిన తీరు ఆయన రాక్షస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతూనే మరోవైపు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించవచ్చని బాబు అంటున్నారని ధ్వజమెత్తారు.

జాతీయ పార్టీ బిజెపి కి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కేవలం బాబు అజెండానే ఫాలో అవుతున్నారని… పోలీసు అధికారులపై ఈసీకి ఆమె రాసిన లేఖ… ఎవరెవరిని తీయాలో… వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా సూచించడం చూస్తుంటే అర్జంటుగా తన మరిది బాబును సిఎం పీఠంపై కూర్చోబెట్టాలన్నట్లుగా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్