Friday, November 22, 2024
HomeTrending Newsబిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్: టిడిపి-జనసేన డిక్లరేషన్

బిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్: టిడిపి-జనసేన డిక్లరేషన్

చంద్రన్న బీమా పథకాన్ని పది లక్షల రూపాయలతో పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని, పించన్ నెలకు రూ.4 వేలు ఇస్తామని, రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికలో రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని, నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బిసిలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నలుగురు రెడ్లతో పెత్తందారీ వ్యవస్థను సిఎం జగన్ నడుపుతున్నారని, అలాంటి జగన్ కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. తాము పదవుల కోసం పోరాడడం లేదని, భావితరాల భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్, తాను కలిసి పోరాడుతున్నామని పేర్కొన్నారు. మంగళగిరి సమీపంలో జరిగిన జయహో బిసి సభలో చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిసి డిక్లరేషన్ విడుదల చేశారు.

చంద్రబాబు తన ప్రసంగంలో బిసి డిక్లరేషన్ తో పాటు బిసి సంక్షేమానికి తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.

  • చట్టబద్ధంగా కులగణన నిర్వహిస్తాం
  • బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం
  • ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తాం
  • బిసిలకు పెళ్లి కానుకను లక్ష రూపాయలు పెంచుతాం
  • శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందజేస్తాం
  • గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
  • ఎలాంటి షరతులు లేకుండా విదేశీ విద్య పథకం అమలు
  • పిజి విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్మెంట్ అమలు చేస్తాం
  • స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభం
  • బిసిలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరణ
  • కొన్ని బిసి వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం
  • బిసిలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తాం, నిధులు ఖర్చు చేస్తాం
  • బిసిల ఆర్ధిక పరిస్థితుల అధ్యయనం కోసం సామాజిక న్యాయ పరిశీలనా కమిటీ ఏర్పాటు

  • బిసిల స్వయం ఉపాధికి ఐదేళ్ళలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం
  • రూ. 5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు అందజేస్తాం
  • సబ్ ప్లాన్ తో ఐదేళ్ళలో లక్షన్నర కోట్ల రూపాయలు బిసి సంక్షేమానికి  ఖర్చు చేస్తాం
  • సబ్ ప్లాన్ నిధులు బిసిలకే ఖర్చు చేసేలా చర్యలు
  • స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ పునరుద్ధరిస్తాం
  • చట్ట సభల్లో బిసిలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేస్తాం
  • అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్
  • జనాభా ప్రాతిపదికన కార్పోరేషన్లు ఏర్పాటు
  • అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పెండింగ్ లో ఉన్న బిసి భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు పూర్తి చేస్తాం

తాము అధికారంలోకి రాగానే మంగళగిరిలో యూ-1 జోన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. మంగళగిరిలో 20 వేల టిడ్కో ఇళ్ళ నిర్మించి ఇస్తామని, చేనేత కార్మికుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

బిసి కులాలు ఐక్యంగా ఉండాలని అప్పుడే ఈ వర్గాలు తమ హక్కులను సాధించుకోగలుగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 153 బిసి కులాలు జనాభా పరంగా 50 శాతానికి పైగా ఉన్నా వారికి రావాల్సిన వాటా దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్