Friday, November 22, 2024
HomeTrending NewsKavali Incident: లోకేష్... వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

Kavali Incident: లోకేష్… వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

కావలి పట్టణంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన వారిలో తమ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక్కరు ఉన్నా తన పదవికి రాజీనామా చేస్తానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ ఘటనపై బజ్జీల బుజ్జిబాబు లోకేశ్‌, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వాస్తవాలు తెలుసుకోకుండా తమపై నిందలు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన వాటిలో ముఖ్యాంశాలు…

★ ఈ ఘటనలో సుధీర్‌ అనే వ్యక్తి ప్రధాన ముద్దాయి. అతనే గతంలో నా కారుపై కూడా దాడి చేశాడు.
★ టీడీపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్‌ కుమార్‌ ఉన్నాడు.
★ సుధాకర్‌ అనే వ్యక్తి గతంలో జనసేన తరఫున నాపైనే పోటీ చేశాడు. అతని వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయి.
★ వారిని హైదరాబాద్‌లో పెట్టి ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు.
★ అదే అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఏ పార్టీ సపోర్టర్‌ అనేది చూసుకో పప్పు లోకేశ్‌
★ ఐ సపోర్ట్‌ బాబు అంటూ నిందితుడు బ్యానర్‌పట్టుకున్నాడు.
★ వాళ్లు మద్దతు ఇస్తున్నది నీ తండ్రికే కానీ…వాళ్లు వైఎస్సార్సీపీ వాళ్లు కాదు.
★ పవన్‌ కళ్యాణ్‌ నువ్వు కూడా చూసుకో…శివారెడ్డి అనే వాడు నీ పార్టీ కార్యకర్తే.
★ ఎవరు ఎలాంటి వారో…ఎవరు రౌడీషీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తుపెట్టుకో.

★ ప్రజలంతా ఇవన్నీ గుర్తించాలి. కావాలని వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు చేసే ప్రయత్నాలు గమనించాలి.
★ దొంగలే దొంగ దొంగ అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు.
★ టీడీపీ, దాని తోకపార్టీలు చిన్నవిషయం జరిగినా మాకు అంటగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు.
★ ఎవడో ఏదో చెప్పాడని ఈ బజ్జీల బుజ్జి లోకేశ్‌ స్టేట్‌మెట్లు ఇసున్నాడు.
★ బాబూ లోకేశ్… డ్రైవర్‌ ను కొట్టిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసు.
★ నీకు బుర్రలేదు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతున్నావు..వాస్తవాలు తెలుసుకో.
★ భువనేశ్వరి గారు నిజం గెలవాలి అంటుంటే లోకేశ్‌ మాత్రం నిజాలను దాచే ప్రయత్నం చేస్తున్నాడు.
★ నిజాల్ని దాచి వాటిని మామీద రుద్దాలంటే కుదరదు.
★ లోకేశ్‌…ఏదైనా ఉంటే…ప్రిపేర్‌ అయ్యి నిజమా కాదా తెలుసుకుని మాట్లాడాలి.
★ కావలి నియోజకవర్గంలో రౌడీయిజాన్ని సహించేది లేదు.
★ ఎవరైనా ఇలాంటి వారు నావైపు ఉన్నారని మీరు ప్రూవ్‌ చేస్తే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్