పాదయాత్రతో నారా లోకేష్ ఉన్న పరువు కూడా తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేష్ పులకేసి, ఓ మాలోకం అంటూ అభివర్ణించారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ ఓ రాష్ట్ర నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని పవన్, లోకేష్ లు సిఎం జగన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుందని వారిద్దరూ చెప్పగలరా అంటూ అనిల్ సవాల్ చేశారు. విద్యా వ్యవస్థలో సిఎం జగన్ సమూలమైన మార్పులు తీసుకు వచ్చారని, నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని అనిల్ వివరించారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులు అలోచించి ఓటేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అనిల్ విజ్ఞప్తి చేశారు.