Friday, September 20, 2024
HomeTrending NewsBotsa: టిడిపి నేతలది కుయుక్తి రాజకీయాలు

Botsa: టిడిపి నేతలది కుయుక్తి రాజకీయాలు

టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు.. ఎల్లో మీడియా అదే పనిగా ప్రసారం చేస్తున్నట్లు.. జైల్లో ఒకవేళ నిజంగాచంద్రబాబు అనారోగ్యం పాలైతే ఆయనను ఆస్పత్రికి తరలించాలంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆ పని చేయకుండా అదేపనిగా మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నారని, తమపై ఎందుకు నిందలు మోపుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఇంత దిగజారిన రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, ఉక్కపోతతో ఒంటిపై కాస్త ర్యాష్‌ ఏర్పడిందని, ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ నిన్న మీడియాకు స్వయంగా చెప్పారని బొత్స గుర్తు చేశారు. జైల్లో చంద్రబాబుకు ఏదో జరిగిపోతుందని అదే పనిగా విష ప్రచారం చేస్తూ.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఎలాగైనా సానుభూతి పొందాలన్న కుయుక్తి టీడీపీ నేతల్లో కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
బాబు అనారోగ్యంపై నిన్న తనక వచ్చిన ఫోన్ కాల్ పై కూడా బొత్స స్పందించారు. “నాకు రోజూ చాలా మంది ఫోన్‌ చేస్తుంటారు. దాదాపు అన్ని కాల్స్‌ నేను అటెండ్‌ చేస్తాను. నిన్న రాత్రి 9.30కి వచ్చిన కాల్‌ను లిఫ్ట్‌ చేస్తే.. తాను చంద్రబాబు అభిమానినంటూ ఒకరు నాతో మాట్లాడారు. జైల్లో బాబు అనారోగ్యం పాలయ్యారని, కాబట్టి ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలంటూ.. ఏడుస్తూ మాట్లాడాడు. ఆ ప్రచారం అసత్యమని, జైల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్నారని, అయినా ఆయన్ను బయటకు తీసుకురావడం తన చేతిలో లేదని చెప్పాను. ఒకవేళ బాబు నిజంగా జైల్లో అనారోగ్యం పాలైతే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పాను. దాంతో ఆ వ్యక్తి సమాధానపడి ఫోన్‌ పెట్టేశాడు. కానీ ఆ తర్వాత చూస్తే.. నా ఫోన్‌కాల్‌ మాటలు మీడియాలో ప్రసారం అయ్యాయి. మరి ఆ కాల్‌ చేసింది ఎవరు? టీడీపీ నేతలా? లేక బాబు కుటుంబ సభ్యులా? ఎవరు చేయించినా.. నేను అటెండ్‌ చేసిన కాల్‌ను ఎలా రికార్డు చేశారు? ఆ హక్కు వారికెవరు ఇచ్చారు? ఇదేం పైశాచికం?” అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్