Sunday, February 23, 2025
HomeTrending Newsనేడు కూడా టిడిపి సభ్యుల సస్పెన్షన్

నేడు కూడా టిడిపి సభ్యుల సస్పెన్షన్

TDP Members Suspend: అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకున్న తెలుగుదేశం శాసన సభ్యులపై నేడు కూడా వేటు పడింది.  సభ ప్రారంభం కాగానే జంగారెడ్డి గూడెం సంఘటనపై టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని, వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున మళ్ళీ అదే అంశంపై తీర్మానం ఇవ్వకూడదని స్పీకర్ సూచించారు. అయినా సరే సభ్యులు శాంతించలేదు. దీనితో  సభ్యులను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ సిఎం కె. నారాయణ స్వామి తీర్మానం ప్రతిపాదించారు, దీనికి సభ ఆమోదం తెలియజేయడంతో సభ్యులపై నేడు ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

నిమ్మకాయల చిన రాజప్ప, అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవానీ, అనగాని సత్య ప్రసాద్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వి.జోగేశ్వర రావు లు సస్పెన్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్