Sunday, January 19, 2025
HomeTrending NewsTDP: ఢిల్లీలో లోకేష్... రాజమండ్రిలో భువనేశ్వరి

TDP: ఢిల్లీలో లోకేష్… రాజమండ్రిలో భువనేశ్వరి

నేడు గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే పేరిట దీక్షలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టి సాయంత్రం లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించాలని టిడిపి నిర్ణయించింది. దీనిలో భాగంగా ఢిల్లీలో నారా లోకేష్ దీక్ష చేపట్టారు. పార్టీ రాజ్యసభ్య సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో జరిగిన ఈ దీక్షలో ఇతర ఎంపిలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, నేతలు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

మరోవైపు నారా భువనేశ్వరి రాజమండ్రిలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నగరంలోని టిడిపి కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నచంద్రబాబు కూడా నిరసన చేపడుతున్నట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్