Monday, February 24, 2025
HomeTrending Newsఈ యాత్రతో ఎవరికీ ఉపయోగం లేదు: అచ్చెన్న

ఈ యాత్రతో ఎవరికీ ఉపయోగం లేదు: అచ్చెన్న

Charge Sheet: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు మరోసారి స్పష్టంగా వెల్లడించారు.ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీశారని, దీన్ని బట్టే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందొ స్పష్టంగా అర్ధమైన్దన్నారు. ఈ వ్యతిరేకత ఇంకా పెరగకముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సిఎం జగన్ ఆలోచిస్తున్నారని అచ్చెన్న అభిప్రాయ పడ్డారు. మూడేళ్ళ జగన్ పాలనపై టిడిపి ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని టిడిపి కార్యాలయంలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు.

మహానాడుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో నోరు లేని మూగ జీవులు బీసీ మంత్రుల్ని, వారు చేసిన బస్సు యాత్ర వాళ్ళ ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. నాడు-నేడు పేరుతో 5 వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని, 30 లక్షల ఇళ్ళు కట్టామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం మూడు ఇళ్ళు కూడా కట్టలేదని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్