Sunday, January 19, 2025
HomeTrending Newsప్రాజెక్టుల పురోగతి రివర్స్ : చంద్రబాబు

ప్రాజెక్టుల పురోగతి రివర్స్ : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పురోగతిని రివర్స్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ‘ డిజిటల్ మహానాడు’ లో భాగంగా నీటిపారుదల అంశంపై చేసిన తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు.

తెలుగు దేశం హయాంలో గొలుసు కట్టు చెరువులు, ఫాం పాండ్స్ అభివృద్ధి చేశామని కానీ ఈ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. రాష్ట్రమంతటా 8 లక్ష ఫాం పాండ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీటి సమస్య లేకుండా, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చి దిద్దేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రైతుకు గుట్టుబాటు ధర రావాలి, పరిశ్రమలు రావాలి, సేవారంగాన్ని అభివృద్ధి చేదాలనే లక్ష్యంతో తాము పనిచేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

రైతులకు అరా కొరా ఇస్తూ ఫుల్ పేజి ప్రకటనలు మాత్రం ఇచ్చుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భీమా, ఇన్పుట్ సబ్సిడీ  రైతులకు తమ హయాంలో ఎప్పటికప్పుడు ఇచ్చామన్నారు.   రైతు భరోసా కింద  కేవలం రూ. 7,500 వేలు మాత్రమే ఇస్తూ, కేంద్రం ఇచ్చే వాటిని కూడా తమ ఖాతాలో కలుపునున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్