Wednesday, March 11, 2026
HomeTrending Newsఇది కోడి కత్తి డ్రామా 2 : టిడిపి సోషల్ మీడియా ప్రచారం

ఇది కోడి కత్తి డ్రామా 2 : టిడిపి సోషల్ మీడియా ప్రచారం

నిన్న రాత్రి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తెలుగుదేశం పార్టీ కోడి కత్తి డ్రామా 2 అంటూ పేర్కొంటోంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా కోడి కత్తి పేరిట నాటకం ఆడారని, ఇప్పుడు ఈ డ్రామాకు తెర తీశారాని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనికి జతగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు చేసిన ఓ పోస్ట్ ను ఆధారంగా చూపుతున్నారు.

“హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్ సన్నిహితుడు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పోస్టులు వేశాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా కూడా సంచలనం జరగబోతుంది అంటూ ట్వీట్ వేశాడు. సరిగ్గా ఇప్పుడు నాలుగు రోజుల క్రితం అదేవిధంగా ట్వీట్ వేశాడు. దీని వెనుక మర్మమేంటి అనేది సీబీఐ తేల్చాలి” అంటూ టిడిపి నేతల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. #KodiKathiDrama2 పేరిట హ్యాష్ టాగ్ చేస్తున్నారు.
ఈ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కోస్తాలో… రాజధాని ప్రాంతంలో కూడా సిఎం జగన్ కు వచ్చిన అపూర్వ ఆదరణ తట్టుకోలేక టిడిపి ఈ రకమైన దాడులకు పురిగోల్పుతూ మరోవైపు దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular