Tuesday, March 17, 2026
Homeసినిమాఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు : బాల‌కృష్ణ‌ టీమ్

ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు : బాల‌కృష్ణ‌ టీమ్

Its False: నందమూరి బాలకృష్ణకు ఆమ‌ధ్య చేతికి స‌ర్జ‌రీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల బాల‌య్య మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందంటూ ఒక ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆ ఫొటోలో బాలయ్య డాక్టర్లతో కలిసి ఉన్నారు. ఆయన మోకాలికి కట్టు ఉంది. కాలికి నిజంగా సర్జరీ జరిగిందా అన్న విషయం ఆ ఫొటోలో తెలియడం లేదు కానీ, మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

దాంతో బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం టీం ఒక ప్రకటన విడుదల చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు అంటూ ఒక ప్రకటన విడుద‌ల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular