Saturday, March 14, 2026
Homeసినిమాభీమ్లా నాయ‌క్ నుంచి స్పెష‌ల్ టీజ‌ర్

భీమ్లా నాయ‌క్ నుంచి స్పెష‌ల్ టీజ‌ర్

Essence of Bheemla Nayak :
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘భీమ్లా నాయ‌క్’. ఈ చిత్రానికి యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు.

ఈ భారీ, క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. ఆర్ఆర్ఆర్ వ‌స్తున్న‌ప్ప‌టికీ.. తగ్గేదే లే అంటూ భీమ్లా నాయ‌క్ బ‌రిలోకి వ‌స్తున్నాడు. ఇటీవ‌ల భీమ్లా నాయ‌క్ నుంచి టీజ‌ర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయ‌డం.. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం తెలిసిందే. తాజాగా భీమ్లా నాయక్ నుంచి ఎసెన్స్ ఆఫ్ భీమ్లానాయక్ అడవి తల్లి మాట.. పేరుతో స్పెషల్ గ్లింప్స్ ని టీమ్ విడుదల చేయనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.08 గం.లకు ఈ వీడియోని విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular