Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ తో టెక్‌ మహీంద్ర ఎండీ భేటీ

సిఎం జగన్ తో టెక్‌ మహీంద్ర ఎండీ భేటీ

టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ. గుర్నాని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో జగన్‌ను కలిసి ఏపీలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణ గురించి గుర్నానీ చర్చించారు.

నేటి సమావేశంలో విశాఖలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.  ఏపీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్‌ టెక్నాలజీలపై నైపుణ్యాభివృద్ధి,  ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలను కల్పించే అవకాశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.  టెక్‌ మహీంద్రాతో కలిసి కార్యాచరణ చేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను సిఎం జగన్ ఆదేశించారు.  సమావేశంలో పాల్గొన్న టెక్‌ మహీంద్ర గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌) సీవీఎన్‌. వర్మ, సీనియర్‌ బిజినెస్‌ హెడ్‌ రవిచంద్ర కొల్లూరు, రిక్రూట్‌మెంట్‌ లీడర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వీరంరెడ్డి, అడ్మిన్‌ మేనేజర్‌ (విజయవాడ) జయపాల్, సీఎంవో అధికారులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్