Thursday, March 19, 2026
HomeTrending NewsAP Tourism: మూడు ప్రాంతాల్లో మహీంద్రా హోటల్స్

AP Tourism: మూడు ప్రాంతాల్లో మహీంద్రా హోటల్స్

ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి  మహీంద్ర గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలుసుకున్నారు. ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి వివరించారు.

ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో సిఎం చర్చించారు.  విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు సిఎంకు తెలిపింది.

ఈ సమావేశంలో  మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular