Sunday, January 19, 2025
HomeTrending Newsక్యూ న్యూస్ పై దాడిలో కేటిఆర్ హస్తం - బండి సంజయ్

క్యూ న్యూస్ పై దాడిలో కేటిఆర్ హస్తం – బండి సంజయ్

క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి వెనుక కేసీఆర్ కొడుకు మంత్రి కేటిఆర్ హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నించే మీడియా సంస్థలను బెదిరించడం, నిషేధించడం కేసీఆర్ కుటుంబానికి అలవాటైందన్నారు. వీ6, వెలుగు పత్రికపై నిషేధం ఇందులో భాగమేనని, కేసీఆర్ పాలనలో మీడియా సంస్థలపై దాడులు ఊహించినవే అన్నారు. మరిన్ని దాడులు జరిగే ప్రమాదముందన్నారు.

ఈ దాడులన్నీ ఊహించినవే…భవిష్యత్తులో మరిన్ని దాడులు ఇంకా జరిగే ప్రమాదముంది. భరించడానికి సిద్ధంగా ఉండాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకార మదంతో వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నేతల తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే సమయం కోసం వారంతా వేచి చూస్తున్నారు. కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

దాడికి పాల్పడ్డ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలి. దోషులెంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Also Read : బీజేపీ హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్