బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిల సమక్షంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ రోజు కమలం పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న. కొద్దిరోజుల క్రితం సిఎం కెసిఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు మల్లన్న కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న జైలుకు వెళ్ళడం జరిగింది. జైలులో ఉన్నపుడు మల్లన్నను కలిసిన ఎంపి ధర్మపురి అరవింద్ పార్టీలోకి ఆహ్వానించారని వార్తలు అప్పట్లో వచ్చాయి.
తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కెసిఆర్ టార్గెట్ గా విమర్శలు చేయటం, ఆయన చేసిన ఆరోపణలతో కూడిన వార్తలు సోషల్ మీడియాలో చాలా ఆదరణ పొందాయి. ఒక దశలో మెయిన్ స్ట్రీం మీడియా కన్నా సోషల్ మీడియాలో మల్లన్న వార్తలు, ప్రభుత్వంపై ఆయన చేసే ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇన్నాళ్ళు స్వతంత్రంగా, ఏ పార్టీతో పొట్టు లేకుండా వ్యవహరించిన మల్లన్న కొద్ది రోజులుగా తెరాస వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఎదో ఒక పార్టీలో చేరాల్సిన సందర్భం వచ్చింది. జైలులో ఉన్నపుడు నైతిక స్థైర్య ఇచ్చిన బిజెపి నేతల తీరుతో ఆయన కమలం వైపే మొగ్గు చూపారు.
Also Read : లోక్ సభలో TRS ఎంపీల నిరసన