Sunday, January 19, 2025
Homeసినిమాపెద్ద సినిమాలతో పోటీపడుతున్న 'హనుమాన్'

పెద్ద సినిమాలతో పోటీపడుతున్న ‘హనుమాన్’

హనుమంతుడు అంటే చిన్నపిల్లలకి  చాలా ఇష్టం. అందుకు కారణం .. వాళ్ల దృష్టిలో ఆయన సూపర్ హీరో. పర్వతాలను బండరాళ్ల మాదిరిగా పెకిలించే శక్తి సామర్థ్యాలు ఆయన సొంతం. గాలిలో బాణంలా దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత. అందువల్లనే ఆయన సినిమాల పట్ల వాళ్లు ఆసక్తిని చూపుతుంటారు. ఇప్పుడు ఇలాంటి ఆసక్తినిపెంచే సినిమాగా ‘హను మాన్’ కనిపిస్తోంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించింది.

‘అంజనాద్రి’ అనే ప్రాంతంలో నివసించే యువకుడికి హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది. అక్కడ ఏదో సూపర్ పవర్ ఉందని భావించిన విలన్, తన స్వార్థ ప్రయోజనాల కోసం దానిని సొంతం చేసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేదే కథ.ఈ కథలో హీరో చేసే పనుల వెనుక హనుమంతుడు ఉండటమనేది, పిల్లల్లో ఎక్కువ ఆసక్తిని పెంచే అంశం. అందువలన ఈ సంక్రాంతికి ఈ సినిమా సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సంక్రాంతికి నాగార్జున ‘నా సామిరంగ’ సినిమా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన సినిమా ఇది. సంక్రాంతి పండుగ నేపథ్యానికి కావలసిన అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. ఈ తరహా కథల్లో మెప్పించిన రికార్డు నాగార్జునకి ఉంది. ఇక మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఇంత పెద్ద సినిమాల మధ్యకి ‘హను మాన్’ వస్తున్నాడంటే, కంటెంట్ పై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్