Saturday, November 23, 2024
HomeTrending NewsTSPSC: గ్రూప్‌-1 ఫైనల్‌ కీ విడుదల

TSPSC: గ్రూప్‌-1 ఫైనల్‌ కీ విడుదల

గ్రూప్‌-1 తుది కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్‌.. గ్రూప్‌-1కీ పై చర్చించి ఫైనల్‌ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో సరైన సమాధానాలు లేని కారణంగా ఎనిమిది ప్రశ్నలను తొలగించింది. మరో రెండు ప్రశ్నలకు ప్రాథమిక కీలో ఇచ్చిన ఆప్షన్లను మార్చింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనల మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రూప్‌-1ను 150 మార్కులకు నిర్వహించగా, తాజాగా 8 ప్రశ్నలను తొలగించడంలో 142 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే అవకాశాలున్నాయి.

2.33 లక్షల అభ్యర్థులు
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన 2,33,506 అభ్యర్థులకు చెందిన డిజిటల్‌ ఓఎమ్మార్‌ షీట్లను, మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ జూన్‌ 28న విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై జూలై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు ప్రతిపాదనలను కమిషన్‌ ముందు ఉంచింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కమిషన్‌ మంగళవారం తుది కీని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ నెలలోనే గ్రూప్‌-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్