Friday, November 22, 2024
HomeTrending Newsకేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకుంది.

రాష్ట్రంలో పదహారు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఇందులో ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేరు, పెరిక,లింగాయత్, గంగపుత్ర కార్పొరేషన్లు ఉన్నాయి. ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)
01 . ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
02. ఆర్య వైశ్య కార్పొరేషన్
03. రెడ్డి కార్పొరేషన్
04. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
05. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్

మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు
• కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
• సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
• ఏకలవ్య కార్పోరేషన
• మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)
• అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు
• ఆరోగ్య శ్రీరేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు
• ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది
• 92 శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతుభరోస పూర్తవుతుంది.

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇచ్చినట్లు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. 

మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. మహిళ సంఘాలకు ఏటా 20 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని డిసైడ్ చేసింది. మహిళ సంఘలకు పది లక్షల వరకూ బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం అన్ని మహిళ సంఘాలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.

విద్యుత్ కొనుగోళ్ళ పైన కమిటి ఏర్పాటు చేశారు. కమిటీకి జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు కమిటీకి ఆమోదం తెలిపింది. విచారణ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ పినాకిని చంద్రబోస్‌ను నియమించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని నిర్ణయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్‌ అలీఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకుందని తెలిసింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్